సమాజాన్ని మార్చుటకు భౌతికవాదదృక్పధం అవసరం అనీ, మతతత్వ శక్తులను ఓడించాలి.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు సి వై పుల్లయ్య పిలుపు
……………..
సమాజాన్ని మార్చుటకు చరిత్రను, సైన్స్ ను రాజకీయాలను భౌతిక వాద దృక్పథంతో అధ్యయనం చేయాలని, ఆచరణకు అన్వయించుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకులు సీవై పుల్లయ్య పిలుపునిచ్చారు. నేడు దేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ ఓట్ల లబ్ధి కోసం శ్రీ రాముడిని కాండేట్గా ప్రచారం చేయటం సరైనది కాదని ఆయన విమర్శించారు. దేశంలో మైనార్టీలు దళితులు ఆదివాసులు ఎన్ ఆర్ సి,సి ఏ ఏ లను ఉపయోగించి, వెల్ల గొట్టాలని మోడీ కుట్రలు చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించుటకు లౌకిక శక్తులు ఐక్యం కావాలని ఆయన అన్నారు.
2024 మార్చి31న ఆదివారం వైరా లో విక్రమ్ భవనంలో కారల్ మార్క్స్ స్టడీ సర్కిల్ కార్యక్రమం ప్రారంభిస్తూన్న సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కె అర్జునరావు,తాళ్ల శ్రీను, మేడికొండల రావు, పూర్ణకంటి సైదుబాబు కన్నెగంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
కె అర్జునరావు
కార్యదర్శి
వైరా స్టడీ సర్కిల్
ఖమ్మం జిల్లా.









