పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం

పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి

జగిత్యాల ,పీపుల్స్ లీడర్ న్యూస్ :- విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందిన ఎస్.ఐ మన్సూర్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ గంగరాజం గార్లని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన అదనపు ఎస్పీ శ్రీ భీమ్ రావు .ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన అదనపు ఎస్పీ  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. సుమారు 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఎస్.ఐ మన్సూర్ ఖాన్, 36 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుల్ గంగరాజం గార్ల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.ఈ కార్యక్రమంలో RI వేణు, పదవి విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు