– హృదయ స్పందన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాండ్రంకి తారక్
ఆమదాలవలస ,పీపుల్స్ లీడర్ న్యూస్ :-ఆమదాలవలసలోని శ్రీ పాలపోల అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో శనివారం హృదయ స్పందన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించినట్లు హృదయ స్పందన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాండ్రంకి తారక్ తెలిపారు. అలాగే బూర్జి మండలం జనసేన ఎంపీటీసీ సిక్కోల్ విక్రం మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న18 నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు రక్తదానం చేయ్యొచ్చని, ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చెయ్యొచ్చని,
ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరుమాసాలు, పురుషులైతే మూడుమాసాలు తర్వాతనే రక్తాన్ని రెండవసారి ఇవ్వడానికి వీలుంటుంది అన్నారు.ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ పెనుభూతం మానవుడిలో మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని, కుటుంబాల
ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుం దన్నారు.సుమారు 100 మంది వరకు రక్తదానం చేశారన్నారు. అలాగే 1500 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తులో యువత పాల్గొన్నారు.









