వీణవంక ,పీపుల్స్ లీడర్ న్యూస్ :-వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామ ముద్దుబిడ్డ , అతిధి డెవలపర్స్ అధినేత, కాంగ్రెస్ యువ నాయకులు కోమ్మిడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం సాయంత్రం తన స్వగృహంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగాయి. కొమ్మిడి రాకేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.కొమ్మిడి రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతర వేన సతీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే వీణవంక మండల కేంద్రంలో కోమ్మిడి రాకేష్ రెడ్డి వీరాభిమాని నయీమ్ పాషా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. జన్మదిన వేడుకలలో పాల్గొన్న అభిమానులు మాట్లాడుతూ.. నర్సింగాపూర్ ముద్దుబిడ్డ, ఆపదలో ఆప్తుడు, అనాధల ఆశాజ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల ఆపద్బాంధవుడు, అన్నా అంటే నిన్ను ఉన్న అనే నాయకుడు, ముక్కు సూటి, నికార్సైన ప్రజా నాయకుడు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ యువ నాయకుడుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ప్రతిక్షణం ప్రజల కోసం అనే నినాదంతో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన, రాకేష్ రెడ్డి ఎలాంటి జన్మదిన వేడుకలను జరుపుకోవాలని, వీణవంక మండలానికి యూత్ ఐకాన్ గా మారాలని, రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టి, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో వీణవంక కాంగ్రెస్ మండల నాయకులు, రాకేష్ రెడ్డి యువ సైన్యం నాయకులు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









