జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి రాయికల్ పీపుల్స్ లీడర్ న్యూస్: రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం అటవీ ప్రాంతంలో దాదాపు 1,82,000 రూపాయల విలువ గల 6 టేకు చెట్లను అక్రమంగా నరికి వేసిన బోర్నపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులను జన్నారం నుండి ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్ బృందంతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా చెట్లను నరికి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Post Views: 4









