చిలకలూరిపేట ,పీపుల్స్ లీడర్ న్యూస్ :-
పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యాలయం లో శుక్రవారం ఉదయం 10 గంటలకు బీసీ నాయకులు చొప్పా వీరనారాయణ అధ్యక్షతన జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా యువజన అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్ సాయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పృధ్వీరాజ్ మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం, బీసీల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల గురించి అంటరాని తనం వల్ల ఆ రోజులలో ఎదుర్కొన్న సమస్యల పైన అవిశ్రాంతంగా పోరాడిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు., బీసీ సంక్షేమ సంఘ సలహాదారులు కొండ్రముట్ల నాగేశ్వరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంతటి వారె జ్యోతిరావు పూలే మా గురువు అని ప్రకటించడం మన అందరి అదృష్టమని ఆయన అన్నారు. అంతేకాక పూలే తన జీవితాంతం బహుజనులు ఎదుర్కొంటున్న అంటరానితనం, వివక్ష, దోపిడీలపై పోరాటం చేసిన మహానుభావుడు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు తుర్లపాటి వెంకట నగేష్ మాట్లాడుతూ పూలే జీవితాంతం బీసీల ఐక్యత కోసం అభివృద్ధి కోసం పాటుపడ్డారు అని అదే క్రమంలో మన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కూడా బీసీ సంఘాల అభివృద్ధి కోసం మరియు ఐక్యత కోసం పాటుపడుతున్నారని అన్నారు., ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా అధ్యక్షులు వంజా ముత్తయ్య మాట్లాడుతూ 1827లో ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలో జన్మించిన ఫూలే తన జీవితాంతం సమాజంలోని అసమానుతులపై పోరాడారని, పేద బడుగు బలహీన వర్గాల విద్యావ్యాప్తి కోసం మరియు సమానత్వం కోసం కృషి చేశారు, 1873లో సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి అంటరానితన నిర్మూలన కోసం పాటుపడ్డారు అన్నారు. అంతేకాక 1890 నవంబర్ 28న తనువు చాలించే అంతవరకు కూడా సమాజంలోని వివక్షతలపై అంటరాని తణ నిర్మూలన కోసం ఆయన పాటుపడ్డారని వారిని స్మరించుకోవడం మన అదృష్టం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన అధ్యక్షులు త్రిపురం సాయి , రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఆలా శివ గోపి యాదవ్ , మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకట్, నక్క వెంకటేష్, మాదాసు సాయి తేజ , నక్కా పోతురాజు , నియోజకవర్గ వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు తన్నీరు కోటేశ్వరరావు, పల్లపు రామకృష్ణ ( ఆర్కె ), జనం న్యూస్ రిపోర్టర్ చలికినీడి నాగరాజు, ఆలా రమేష్ తదితరులు పాల్గొన్నారు..









