♦అభినందించిన ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం
కరీంనగర్ ,పీపుల్స్ లీడర్ న్యూస్ :-2025 జనవరిలో నిర్వహించిన ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ, టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్, చిత్రలేఖనం పరీక్షల్లో కరీంనగర్ జిల్లా మానకొండూరు దేవంపల్లి ఎస్సీ గురుకుల పాఠశాల/ కళాశాల కు చెందిన 18 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.అందులో డ్రాయింగ్ అయ్యర్ లో 7 గురు విద్యార్థులు, డ్రాయింగ్ లోయర్ లో 11 మంది ఉన్నారు .ఈ సందర్భంగా డిసిఓ/ మానకొండూరు దేవంపల్లి గురుకుల పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ టిచర్ పి నరసింహ చారి, పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు రేనుకుంట బాబు, గురుకులాల పూర్వ విద్యార్థి, దేవంపల్లి పేరెంట్ మొగురం రమేష్, పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా గురుకులాల కరీంనగర్ జిల్లా కో -ఆర్డినేటర్ , దేవంపల్లి ఎస్సీ గురుకుల ప్రిన్సిపాల్ గోలి జగన్నాథం మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో కూడా శిక్షణ ఇస్తూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతకు పదును పెడుతున్నామన్నారు. మానకొండూర్ దేవంపల్లి గురుకులంలో చదివే విద్యార్థులు చదువుతోపాటు , ఆట,పాటలతో పాటు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ లో ముందున్నారని ఆయన తెలిపారు. పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయడమే ఉపాధ్యాయుల లక్ష్యం అన్నారు.









