తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల నియోజకవర్గంలో ఆవునురి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల ,పీపుల్స్ లీడర్ న్యూస్ :-సిరిసిల్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవునూరి దయాకర్ రావు  పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కటింగ్ చేయడం జరిగింది, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గయ్య నందమూరి తారక రామారావు గారి సేవలను కొనియాడుతూ వారు సూచించిన దారిలో నడుస్తూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు కృషి చేస్తామని చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీకి పునర్ వైభవం తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలిపారు, తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతీ కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని దయాకర్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు తీగల శేఖర్ గౌడ్, నక్క రాజయ్య, ఆడెపు లక్ష్మీనారాయణ, బింగి వెంకటేశం, గుజ్జే శివరాం, మ్యాన వెంకటేశం, గుజ్జే అశోక్, బండారి నారాయణ, బేతి రవీందర్, జెట్టి కొమరయ్య, వేముల సత్యనారాయణ, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు