*మోదీ, చంద్రబాబు, పవన్, లోకేశ్ మంచికోసం, రాష్ట్రాభివృద్ధికోసం ఆరాటపడుతుంటే జగన్ భరించలేకపోతున్నాడు,
* సోషల్ మీడియాలో దుష్ప్రచారం, పెట్టుబడిదారులకు తప్పుడు మెయిల్స్ తో జగన్ రాష్ట్రప్రగతిని అడ్డుకుంటున్నాడు
* శారదా హైస్కూల్లో రూ.42 లక్షలతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ రూమ్ ను ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
చిలకలూరిపేట, పీపుల్స్ లీడర్ న్యూస్:-
చిలకలూరిపేట…రాష్ట్ర విద్యారంగంలో లోకేశ్ విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారని, ధైర్యంగా పట్టుదలతో విద్యార్థుల భవిష్యత్ కోసం నూతన ఆలోచనలు చేస్తున్న ఘనత మంత్రి లోకేశ్ కే దక్కుతుందని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటిపుల్లారావు తెలిపారు. పట్టణంలోని శారదా హైస్కూల్లో రూ.42 లక్షలతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ప్రత్తిపాటి బుధవారం ప్రారంభించారు.
Post Views: 8









