చిలకలూరిపేట,పీపుల్స్ లీడర్ న్యూస్:-
* ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వసనీయత, నిబద్ధతే ఏపీకి బలం : ప్రత్తిపాటి.
* ఉత్తమ విద్యాబోధనతో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నదే లోకేశ్ తాపత్రయం. : ప్రత్తిపాటి
* విద్యార్థులు గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించి, జీవితంలో బాగా రాణించాలి : ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
* యడ్లపాడు మండలం సొలసలో పలు అభివృద్ధి పనులు, డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ
విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరి కోసం ఉద్యోగాలు ఎదురుచూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యడ్లపాడు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గ్రామస్తులతో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామంలో రూ.40లక్షలతో నిర్మించిన కల్వర్టు, పాఠశాల ప్రహరీ, సీసీ రోడ్లను ప్రారంభించారు.









