– ఎస్సై ఆవుల తిరుపతి
వీణవంక ,పీపుల్స్ లీడర్ న్యూస్ :- మండలంలోని కోర్కల్ మానేరు వాగు నుంచి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న TS02UD3614, TS02UC8749,TS02UD8216, TS02UE1394 నెంబర్లు గల నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. ట్రాక్టర్లను స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ యజమానులు ఐన అంబాల రాజ్ కుమార్ s/o రాజయ్య, పాశల సతీష్ s/o రాజయ్య, ఎల్కపల్లి రాహుల్ s/o ఓదెలు, బండ అరవింద్ s/o వెంకటేశ్వర్లు r/o కోర్కల్ ల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.
Post Views: 9









