– హుజురాబాద్ ఏసిపి మాధవి
వీణవంక ,పీపుల్స్ లీడర్ న్యూస్ :-వీణవంక మండలం లోని పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం వీణవంక పోలీస్ స్టేషన్ లో కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి మాధవి మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరును,పోలీస్ స్టేషన్ లో నిర్వహించే విధులు,పౌరులు పొందాల్సిన సేవల గురించి వివరించారు. విద్యార్థులకు డయల్ 100,షీ టీమ్,సైబర్ క్రైమ్,ఆయుధాల పనితీరు,డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టలు,డ్రగ్స్ వాడినప్పుడు మూత్రం ద్వారా టెస్ట్ చేసి నిర్ధారించవచ్చని అన్నారు.24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ అని ఫింగర్ ప్రింట్ ద్వారా పాత నేరస్తుల ను గుర్తుపట్టడానికి సులభంగా ఉంటుందని వివిధ అంశాలపై పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ అమరవీరుల గురించి,భరోసా సెంటర్,ప్రెండ్లి పోలీసింగ్ విధానం మైనర్ విద్యార్థులు బైకులు గాని వాహనాలు గాని నడప రాదని వారికి సూచించారు.విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు జీవితంలో సాధించాల్సిన అంశాల గురించి,చదువు ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై ఆవుల తిరుపతి,ఏఎస్ఐ వెంకటరెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









