ఇసుక ట్రాక్టర్ పట్టివేత

వీణవంక, పీపుల్స్ లీడర్ న్యూస్ :-వీణవంక మండలంలోని చల్లూరు మానేరు వాగు నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. కొయ్యడ నవీన్ కుమార్, బోదాసు సంపత్ చల్లూరు ల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు