నకిలి విలేకరిపై కేసు నమోదు

కోహెడ, పీపుల్స్ లీడర్ న్యూస్ :-
మండలంలోని ధర్మసాగర్‌పల్లి గ్రామానికి చెందిన పొన్నాల సంజీవ్‌ను నకిలీ విలేకరిగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభిలాష్‌ తెలిపారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేటకు చెందిన గుడాల దుర్గా రాంబాబు గత నాలుగు వారాలుగా కోహెడలో చిరువ్యాపారస్తులకు డబ్బులు వడ్డీకి ఇస్తూ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పొన్నాల సంజీవ్‌ నాలుగు వారాలుగా అతనికి ఫోన్‌ చేసి నేను రిపోర్టర్‌నని, తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే నీ గురించి పేపర్‌లో రాస్తానని వాట్సాప్‌, ఫోన్‌ ద్వారా బెదిరింపులకు గురిచేశాడన్నారు. దుర్గా రాంబాబు ఫిర్యాదు మేరకు నకిలీ రిపోర్టర్‌గా గుర్తించి కేసు నమోదు చేసి జ్యూడిషల్‌ రిమాండ్‌కు పంపించినట్లు ఎస్సై అభిలాష్‌ తెలిపాడు. నకిలీ రిపోర్టర్‌గా చలమాణి ఐనట్లయితే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు