శ్రీ దత్త సాయి సన్నిధిలో ఘనంగా కార్తీక దీపారాధన ముఖ్యఅతిథిగా డాక్టర్ లావు సుష్మ

చిలకలూరిపేట ,  ఉమ్మడి గుంటూరు జిల్లా  పీపుల్స్ లీడర్ న్యూస్ :-

చిలకలూరిపేట…ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో మంగళవారం రాత్రి ఘనంగా కార్తీక దీపారాధన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణంలో ప్రముఖ హాస్పిటల్ లీలావతి హాస్పిటల్ అధినేత, గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మా పాల్గొని దీప పూజ చేశారు. అనంతరం ట్రస్టు నిర్వాహకులు డాక్టర్. పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గత 22 రోజులుగా కార్తీకమాసం సందర్భంగా కాశీ నుంచి తెచ్చిన 108 శివలింగాలకు ప్రత్యేక అభిషేకం చేసి కార్తీకమాసం సందర్భంగా కార్తీక దీపారాధన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ విష్ణు సహస్రనామ పారాయణ 108 సార్లు లింగాష్టకం పారాయణ భావించారని అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారని తెలియజేశారు. దత్త సాయి సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు సమాజం సెక్రటరీ అరవపల్లి సత్యనారాయణ గుప్తా, అయినవోలు హనుమంతరావు, తిమ్మాపురం గ్రామ ప్రతినిధి పావులూరి హనుమంతరావు, మహిళా ఆధ్యాత్మిక సేవా భక్తురాలు బచ్చు ఓంకార దేవి తదితరులు పాల్గొన్నారు….

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు