కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఆత్మీయ సన్మానం

జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి రాయికల్ పీపుల్స్ లీడర్ :
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయుడైన గాజంగి నందయ్య నియమితులయ్యారు.ఆదివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్‌లో నందయ్యను ఘనంగా సన్మానించారు.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నందయ్యకు రాయికల్ మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూల బొకేలు అందించి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.డిసిసి అధ్యక్షుడి నియామకంపై సంతోషం వ్యక్తం చేసి పార్టీ బలపడేందుకు నందయ్య నాయకత్వం కీలకమని అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, మాజీ జెడ్పిటిసి గోపి మాధవి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,కొయ్యేడి మహిపాల్, హనుమాన్ ఆలయ చైర్మన్ లు దాసరి గంగాధర్,నాయకులు కోడి పెళ్లి ఆంజనేయులు,తలారి రాజేష్,మండ రమేష్, కోసరి మహేష్, కాటిపల్లి రాజశేఖర్,హరీష్ రావు,బొమ్మ కంటి నవీన్,కిరణ్,బత్తిని నాగరాజు,సుధీర్, జలపతి,శివ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు