జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి రాయికల్ పీపుల్స్ లీడర్ న్యూస్ :రాయికల్ మండలంలోని బోర్నపెల్లిలో కొలువైన పురాతన శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ ఆదివారం వేద మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్థులంతా కలసి తీసుకున్న ఈ శుభ నిర్ణయానికి అనుగుణంగా, ఆలయ పునర్నిర్మాణ పనులకు అధికారికంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో చెన్నమనేని వరద రాజేశ్వరరావు, కోల శ్రీనివాస్, మల్యాల జలపతి రెడ్డి, రాగుల స్వామి, రాగులు సత్యం, ఉప్పు లక్ష్మణ్, బాపురపు వెంకటేష్. కోడిపెల్లి అంజనేయులు. మల్యాల మల్లారెడ్డి. క్యాస గంగాధర్. కొత్త మల్లారెడ్డి లతో పాటు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Post Views: 5









