కోహెడ, పీపుల్స్ లీడర్ న్యూస్:-మండలంలోని తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన ఇట్టిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, బాకూరి మహేందర్‌రెడ్డిలు అక్రమంగా ఇతరుల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభిలాష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోహెడ గ్రామ శివారులోని వింజపల్లి రోడ్డు సమీపంలో గూళ్ళ చంద్రశేఖర్‌కు చెందిన 2 ఎకరాల వ్యవసాయ భూమిని సాదాభైనామా కొనుగోలు చేశారు. ఉద్దేశపూర్వకంగా మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గూళ్ళ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్లు ఆయన తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి ప్రజలను మోసం చెస్తే చట్టరీత్య చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Post Views: 5









